విద్యుత్ కార్మికులతో విద్యుత్ యాజమాన్యం రెండు రోజుల క్రితం చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇందుకు అనుగుణంగా రెండు రోజుల్లనే ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.విద్యుత్ కార్మికుల (ఆర్టిజెన్స్) విధివిధానాలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.లేబర్ కమిషనర్ ఆదేశాల మేరకు స్టాండింగ్ ఆర్డర్ ను అరిజైన్స్ సర్వీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ గా మార్పు మిగతా ఉద్యోగుల లాగానే పే స్కెల్, మెడికల్ ,హెచ్ ఆర్ ఏ ఇతర అలవెన్సు లు వర్తిస్తాయి.
1.10.2019 నుంచి ప్రతి నెల పే స్లీప్ ఇవ్వబడుతుంది. 29.7.2017 నుంచి సెలవు రోజున జీతం తో కూడిన వేతనం వర్తిస్తుంది. సర్వీస్ లో ఉంటూ ప్రమాదవశాత్తు కార్మిడు చనిపోతే 04.12.2016 నుండి వారి కుటుంబ సభ్యులకు ఒకరికి ఉద్యోగంతో పాటు వారి అంత్యక్రియలకి 20,000 వేల రూపాయల నగదు ఇచ్చేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి.ఉద్యోగస్తుల జీతాల వివరాలు గ్రేడ్1. RS15,470/-గ్రేడ్ 2. RS 12,160/-గ్రేడ్ 3. RS 9670/-గ్రేడ్ 4. RS 7820/- పే స్కేల్ తో పాటు ఇతర అలవెన్స్ లు ఇవ్వనున్నారు. ఉత్తర్వులు జారీ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న తెలంగాణ విద్యుత్ కార్మిక సంఘం.(టిఆర్ వి కె ఎస్) సీఎం కేసీఆర్ కు ,సిఎండీలు ప్రభాకర్ రావు,రఘుమా రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపిన టిఆర్ వి కె ఎస్ తోపాటు ఇతర కార్మికుల సంఘాలు.