డబుల్‌ ఇంజిన్‌ శక్తి మాటల్లో కాదు – చేతల్లో చూపాలి : కేటీఆర్

44
ktr
- Advertisement -

భారత ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ వాటా గణనీయంగా పెరుగుతోందన్నారు మంత్రి కేటీఆర్‌. దేశంలో తెలంగాణ జనభా 2.5శాతంగా ఉంటే దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5శాతం ఉంది. జనభా కంటే రాష్ట్రం వాటా రెండింతలు ఉండటం ఏ డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రాష్ట్రంలో లేదని మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. డబుల్ ఇంజన్ శక్తి గురించి మాటల్లో కాదు – చేతల్లో చూపాలని సటైర్ వేశారు. డబుల్ ఇంజిన్ అంటే డబుల్ సర్కార్‌ని కలిగి ఉండటమే కాదన్నారు. ఈ లెక్కల ప్రకారం చూస్తే మేం ఆల్రెడీ డబుల్ ఇంజిన్ లోనే ఉన్నాం కదా అంటూ కామెంట్ చేశారు. ఇది అభివృద్ధిని రెట్టింపు చేయడం, రాష్ట్ర సామర్థ్యం దేశానికి ఉపయోగపడేలా తయారుచేయడాన్ని దానిని డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అంటారని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చాక రాష్ట్ర అదాయం రెట్టింపైందని రాష్ట్ర జీఎస్డీపీ కూడా రెడింతలైందన్నారు. ఇలాంటి గణంకాలు ఏ రాష్ట్రానికి లేవన్నారు.

- Advertisement -