టీ న్యూస్‌ కృషి అభినందనీయం..

187
Telangana Golden Education Fair 2017 closed
Telangana Golden Education Fair 2017 closed
- Advertisement -

టీ న్యూస్-అపెక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్‌లు సంయుక్తంగా మర్రి లక్ష్మణ్‌ రెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్ సమర్పణలో మూడు రోజులపాటు నిర్వహించిన తెలంగాణ గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ముగిసింది. ఆదివారం నాడు జరిగిన ముగింపు కార్యక్రమానికి మంత్రి హరీశ్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఫెయిర్ కు హాజరైన వాళ్లలో నుంచి లక్కీ డిప్ ద్వారా విజేతలను ఆయన ఎంపిక చేశారు. వారికి ల్యాప్ టాప్ లను బహుకరించారు. ఫెయిర్ లో పాల్గొన్న కాలేజీల యాజమాన్యాలకు మెమొంటోలు అందజేశారు.

APEX-CLOSE

ఈ సంధర్బంగా మంత్రి హరీశ్‌ రావు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో టీ న్యూస్‌ కీలకంగా పనిచేసిందన్నారు తెలంగాణ ప్రజల గుండె చప్పుడును ప్రపంచానికి చాటిందన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా భవిష్యత్ తరానికి మంచి విద్య అందాలన్న ఉద్దేశంతో ఇప్పుడు ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించడం అభినందనీయం అన్నారు. ప్రజల మనస్సులోంచి వచ్చిన మీడియాకు ఎప్పటికీ సుస్థిర స్థానం ఉంటుందన్న హరీశ్‌రావు.. ప్రజల గుండెల్లో టీ న్యూస్‌ చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. భవిష్యత్‌ లోనూ టీ న్యూస్‌ మరిన్ని సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.

మూడు రోజులపాటు జరిగిన గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ లో వందకు పైగా కాలేజీలు స్టాల్స్ ఏర్పాటు చేశాయి. లక్ష మందికి పైగా విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి స్టాల్స్ ని సందర్శించి కాలేజీల వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సదస్సులు, కెరీర్ గైడెన్స్ సెషన్స్ విద్యార్థులకు అవగాహన కల్పించాయి. ముగింపు కార్యక్రమంలో మంత్రి హరీశ్ తో పాటు ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, టి న్యూస్ ఎండీ సంతోష్ కుమార్, టీ న్యూస్ సీఈవో నారాయణరెడ్డి, టీ న్యూస్ సీజీఎం ఉపేందర్‌, వివిధ కాలేజీల యాజమాన్యాలు పాల్గొన్నాయి.

- Advertisement -