సమంతతో ‘కాదలి’ పాట..

206
Kaadhali Single Track Launch By Samantha
- Advertisement -

ఆసక్తికరమైన ట్రైయాంగులర్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న చిత్రం “కాదలి”. అందరూ కొత్తవారితో రూపొందిన ఈ చిత్రం కాన్సెప్టే “రెస్పెక్ట్ హర్ ఛాయిస్”. యూత్ ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా రూపొంది టీజర్ విడుదలైన ఈ చిత్రం టీజర్ ప్రేక్షకుల్ని పతాకంపై పఆకట్టుకొంది. పట్టాభి ఆర్. చిలుకూరి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలోని మొదటి పాటను రేపు (మే 29) నటి సమంత సామాజిక మాధ్యమం ద్వారా విడుదల చేయనున్నారు.

“ఎలా తేల్చాలి” అనే పల్లవితో సాగే ఈ యుగళ గీతాన్ని వనమాలి రచించగా.. జోనిత గాంధీ ఈ పాటను పాడారు. ప్రసన్ ప్రవీణ్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ గీతం శ్రోతలను ఆకట్టుకొంటుందన్న నమ్మకాన్ని చిత్ర బృందం వ్యక్తపరిచింది. ఇకపోతే.. జూన్ లో ఈ చిత్రం ఆడియోను విడుదల చేసి.. అదే నెలలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Kaadhali Single Track Launch By Samantha

పూజ కె.దోషి, హరీష్ కళ్యాణ్, సాయి రోనక్, సుదర్శన్, మోహన్ రామన్, డా.మంజరి షర్మిల, గురురాజ్ మానేపల్లి, పల్లవి బానోతు, భాను అవిరినేని, సి.సురేష్ కుమార్, సంధ్యా జనక్, రమాదేవి ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, కొరియోగ్రఫీ: రాజు సుందరం-నోబెల్-శ్రీక్రిష్, పాటలు: వనామాలి, కాస్ట్యూమ్స్: ప్రియదర్శిని.టి, లైన్ ప్రొడ్యూడర్: పునాటి శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆనంద్ రంగా, కళ: వివేక్ అన్నామలై, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, సంగీతం: ప్రసన్ ప్రవీణ్ శ్యామ్, సినిమాటోగ్రఫీ: శేఖర్ వి.జోసెఫ్, రచన-నిర్మాణం-దర్శకత్వం: పట్టాభి ఆర్.చిలుకూరి.

- Advertisement -