ఆవిష్కరణల్లో తెలంగాణకు 4వ స్థానం..

166
Telangana
- Advertisement -

తెలంగాణ నూతన ఆవిష్కరణల్లోనూ మరోసారి సత్తా చాటింది. ఆవిష్కరణల్లో దేశంలోనే నాలుగో ర్యాంకును సాధించింది. బుధవారం నీతిఆయోగ్ విడుదల చేసిన భారత ఆవిష్కరణ సూచీ 2020 ర్యాంకింగ్స్ లో తన స్థానాన్ని పదిలపరుచుకుంది. 2019లో 22.06గా ఉన్న స్కోరును 2020లో 33.23కు పెంచుకున్న రాష్ట్రం మరోసారి నాలుగో స్థానంలో నిలిచింది. కేరళ ఐదో స్థానంలో.. జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, బీహార్‌ చివరి స్థానాల్లో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్‌ ఏడో స్థానానికి పరిమితమైంది. టాప్‌-5లో మహారాష్ట్ర మినహా మిగిలిన రాష్ట్రాలన్నీ దక్షిణాదివే కావడం గమనార్హం.

అనేక అంశాల్లో తెలంగాణ ఊహించినదానికన్న మిన్నగా ప్రదర్శన కనబరిచిందని నీతి ఆయోగ్‌ పేర్కొన్నది. ముఖ్యంగా పరిశోధనలపై దృష్టిపెట్టడం, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడం, ప్రపంచానికి పరిచయం చేయడంలో (నాలెడ్జ్‌ డిఫ్యూజన్‌, నాలెడ్జ్‌ ఔట్‌పుట్‌) అంచనాలకు మించి స్కోర్‌ సాధించినట్టు వెల్లడించింది.

- Advertisement -