ఉచిత బియ్యం పంపిణీ నేటి నుంచే…

501
Rice-Distribution
- Advertisement -

తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. తెల్ల రేషన్ కార్డులున్న కుటుంబంలో ప్రతి ఒక్కరికి 12 కిలోల బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. బియ్యంతో పాటు రూ. 1500లు అందజేయనున్నారు.

87.54 లక్షల ఆహారభద్రత కార్డుల ద్వారా 2.81 కోట్ల మంది లబ్ధిదారులకు ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రేషన్ దుకాణాలు తెరచి ఉండనున్నాయి.

రేషన్‌ దు కాణాల వద్ద మూడు ఫీట్ల నిర్ణీత దూరం పాటించాలనే నిబంధన విధించారు. రాష్ట్రంలో రేషన్‌ పోర్టబిలిటీ అమలులో ఉండటంతో ఎక్కడైనా బియ్యం తీసుకోవచ్చని అధికారులు స్పష్టంచేశారు.

ప్రతినెలా రేషన్‌ తీసుకునేవాళ్లు బయోమెట్రిక్‌ పద్ధతి పాటించాల్సిన అవసరం లేదు. కానీ మూడునెలలుగా రేషన్‌ తీసుకోనివాళ్లు వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. ఆధార్‌కార్డు ఆధారంగా రూ. 1500 నగదును నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేయనున్నారు. బ్యాంకు అకౌంట్ లేని వారికి చెక్కుల రూపంలో అందజేయనున్నారు.

- Advertisement -