లండన్ లో ఘనంగా “తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు”

72
nri trs
- Advertisement -

ఎన్నారై తెరాస మరియు టాక్ సంయుక్తంగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో కార్యవర్గ కుటుంబసభ్యులతో పాటు ప్రవాస తెలంగాణ బిడ్డలు పాల్గొన్నారు.లండన్ లోని హౌంస్లో లో టాక్ ప్రధాన కార్యదర్శి సురేష్ బుడుగం అధ్యక్షతన జరిగిన ఈ వేడుకను కార్యవర్గ సభ్యులంతా కలిసి కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు.కార్యక్రమంలో ముందుగా తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ గారి చిత్ర పటానికి పూలతో నివాళుర్పించి, అమరవీరులని స్మరించుకొని రెండు నిమిషాలు మౌనం పాటించారు.

టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ ముందుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరులను స్మరించుకున్నారు. కెసిఆర్ గారి నాయకత్వంలోని మలి దశ ఉద్యమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి ఉద్యమాభివందనాలు తెలియజేసారు. అమరుల ఆశయాలకు , తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కెసిఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారని , గణాంకాల ప్రకారంగా అభివృద్ధి సూచీలో ఎందులో చూసినా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని . తెలంగాణ ప్రజలంతా కెసిఆర్ గారికి రుణపడి ఉంటారని , రాబోయే రోజుల్లో వారి నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నామని రత్నాకర్ తెలిపారు. టాక్ సంస్థ చేస్తున్న సంస్కృతిక సేవ కార్య క్రమాల గురించి వివరించారు.

టాక్ ఉపాద్యక్షురాలు శుషుమన రెడ్డి మాట్లాడుతూ టాక్ ఆధ్వర్యంలో వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని, మేమంతా కేవలం నేడు సంబరాలకు పరిమితం కాకుండా, నాడు తెలంగాణ ఉద్యమం లో పాల్గొన్నామని, ఉద్యమ జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నారు.కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్యవర్గ సభ్యులకు కృతఙ్ఞతలు తెలిపారు.సలహా మండలి చైర్మన్ మట్టా రెడ్డి మాట్లాడుతూ ఎన్నో త్యాగాలతో సాధించుకున్న తెలంగాణని, బంగారు తెలంగాణగా నిర్మించుకునే బాధ్యత అందరి పైన ఉందని ప్రతి ఒక్కరు వారి శక్తికి తగ్గట్టుగా బాగస్వాములవ్వాలని కోరారు. తెరాస లండన్ ఇంచార్జి నవీన్ భువనగిరి మట్లాడుతూ బంగారు తెలంగాణ కేవలం కెసిఆర్ గారి వల్లే సాధ్యమని, ఎలాగైతే ఉద్యమం లో వారి వెంట ఉన్నామో, బంగారు తెలంగాణ నిర్మాణం లో కూడా వారి వెంట ఉండి మా వంతు బాధ్యత నిర్వహిస్తామని తెలిపారు.

తెరాస ముఖ్య నాయకులు అబూ జాఫర్ గారి వందన సమర్పణతో కార్యక్రమం ముగించారు.ఈ కార్యక్రమంలో టాక్ అధ్యక్షులు రత్నాకర్ కడుదుల , ఉపాధ్యక్షురాలు శుశుమన రెడ్డి, ఉపాధ్యక్షుడు సత్య చిలుముల , అడ్వైసరి చైర్మన్ మట్టా రెడ్డి, టాక్ మరియు తెరాస నాయకులు మల్లా రెడ్డి , సురేష్ బుడుగం, సత్యపాల్,శ్రావ్య , సుప్రజ ,స్వాతి బుడుగం , రవి రెటినేని, నవీన్ భువనగిరి , రవి ప్రదీప్, అబూ జాఫర్,సృజన్ రెడ్డి,ప్రశాంత్,సురేష్ గోపతి,హరి నవాపేట్, మని తేజ, నిఖిల్ , జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు

- Advertisement -