జాతీయ జెండా ఎగురవేసిన సీఎం కేసీఆర్‌

58
kcr ts
- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక హైదరాబాద్ పబ్లిక్‌ గార్డెన్స్‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు సీఎం కేసీఆర్. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

ఇక ప్రగతి భవన్‌ లో సీఎం కేసీఆర్‌ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు సంతోష్‌ కుమార్‌, దీవకొండ దామోదర్‌ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, వివేకానంద, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, ప్రగతి భవన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

రాజ్ భవన్ లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై పూర్తిగా తెలుగులో ప్రసంగించారు. ‘అందరికీ నమస్కారం’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఎంతోమంది అమరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ ఏర్పడిందన్నారు.

- Advertisement -