తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్బావ వేడుకలు ఘనంగా జరిగాయి. పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వేడుకలు.. జాతీయ జెండా ఆవిష్కరించాయి సీఎం రేవంత్ రెడ్డి. ఆవిర్భావ వేడుకల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, పోలీసులు కవాతు నిర్వహించారు. తెలంగాణ కవులకు రూ.కోటి నగదు పురస్కార ప్రధానంతో పాటు పోలీసు సిబ్బందికి అవార్డులను ప్రధానం చేశారు.
తెలంగాణ జాగృతి నూతన కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండా మరియు తెలంగాణ జాగృతి జెండాను ఆవిష్కరించారు ఎమ్మెల్సీ కవిత.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఉపముఖ్యమంత్రి పవన్. జనసేన పార్టీకి జన్మనిచ్చిన నేల, నాకు పునర్జన్మ ఇచ్చిన నేల.. నాలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన నేల తెలంగాణ.. మూడున్నర కోట్ల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు, దశాబ్దాల పోరాటాలకు ప్రతిరూపం.. విద్యార్ధులు, యువత బలిదానాలతో ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ.. అన్ని రంగాల్లో సంక్షేమాభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని కోరుకుంటున్నా అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ఏపి సీఎం చంద్రబాబు. తెలుగు రాష్ట్రాలుగా వేరైనా తెలుగు ప్రజలు, తెలుగు జాతి ఒక్కటే. తెలుగువారు ఎక్కడున్నా సమున్నతంగా ఎదగాలన్నదే నా ఆలోచన, ఆకాంక్ష. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకొంటున్న తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు. తెలంగాణలో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, అభివృద్ధి పథంలో సాగాలి – తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీపడుతూ అగ్రస్థానానికి చేరుకోవాలి. తెలుగుజాతి తిరుగులేని శక్తిగా నిలవాలి.. ప్రతి తెలుగు పౌరుడు భాగస్వామి కావాలి అన్నారు.
Also Read:Covid:4వేలకు చేరిన కొవిడ్ కేసులు

