ఎంపీ సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు స్వఛ్చందంగా ఈ కార్యక్రమంలో పాల్గోని మొక్కలు నాటుతున్నారు. ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం మూడవ దశకు చేరుకుంది. తాజాగా సింగర్ మధుప్రియ మరియు చిలుకనగర్ కార్పొరేటర్ గోపు సరస్వతీ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించారు తెలంగాణ మొదటి మహిళా పైలట్ సంజన మరియు ప్రముఖ నటుడు మధు.
ఈసందర్బంగా వారు మాట్లాడుతూ… ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ఈ గొప్ప కార్యక్రమం చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తోందని అన్నారు. ప్రతీ ఒక్కరం మొక్కలు నాటి వాటిని సంరక్షించి రేపటి భవిష్యత్ తరానికి పచ్చని పుడమిని బహుమతిగా ఇవ్వాలని అలాగే ఈ కార్యక్రమం మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో చిలుకనగర్ కార్పొరేటర్ గోపు సరస్వతి సాదానంద్ పాల్గొన్నారు.