ఏపీలో మ‌రోసారి లాక్ డౌన్

1431
jagan

ఏపీలో క‌రోనా మ‌హామ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్ననేప‌థ్యంలో అధికారులు అల‌ర్ట్ అయ్యారు. కేసులు ఎక్కువ‌గా వ‌స్తున్న జిల్లాల్లో మ‌రింత క‌ఠిన‌మైన రూల్స్ ను అమ‌లు చేశారు. రోజ‌రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుడ‌టంతో మూడు జిల్లాల్లో మ‌రోసారి లాక్ డౌన్ విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు అధికారులు. ప్రకాశం, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలో మళ్లీ లాక్‌డౌన్‌ ప్రకటించారు.

ఆదివారం ఉదయం నుంచి నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇందుకు సంబంధించి అధికారులు ఇప్ప‌టికే ఆదేశాలు జారీ చేశారు. నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌కు మాత్ర‌మే అనుమ‌తి ఉంటుంద‌ని తెలిపారు. కేవలం ఉద‌యం 7నుంచి 10గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే జ‌నాల‌కు రోడ్ల‌పైకి అనుమ‌తి ఉన్న‌ట్లు చెప్పారు. లాక్ డౌన్ నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆదేశాలు జారీ చేశారు అధికారులు.