- Advertisement -
తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు బ్యాలెట్ విధానంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం నుంచే ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రజలు పోలీంగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.
రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ఉపసర్పంచి ఎన్నికనూ రిటర్నింగ్ అధికారి చేపడతారు. మొదటి విడత ఎన్నికలు జరిగే 4479 పంచాయతీల్లో 769 పంచాయతీలు.. 39,822 వార్డుల్లో 10,654 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతోపాటు 9 పంచాయతీలు, 192 వార్డులకు దాఖలైన నామినేషన్లు పూర్తిగా చెల్లకుండా పోయాయి. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు.మిగతా రెండు విడతల పోలింగ్ ఈనెల 25, 30 తేదీల్లో జరగనుంది.
- Advertisement -