తెలంగాణ బడ్జెట్ హైలైట్స్..

65
- Advertisement -

సోమవారం నుండి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైయ్యాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. రూ. 2,56,958.51 కోట్ల‌తో బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. ప్రజల ఆకాంక్షల మేరకు బడ్జెట్‌ను రూపొందించామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే 86 శాతం అధికంగా ఉందని చెప్పారు. రాష్ట్రం ఆవిర్భవించిన అన‌తికాలంలో అద్భుత ప్ర‌గ‌తి సాధించామ‌ని హ‌రీశ్‌ రావు తెలిపారు.

బడ్జెట్ కొన్ని హైలైట్స్:

-ఆర్టీసీకి రూ. 1,500 కోట్లు
-ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ కు రూ. 1,343 కోట్లు
-రీజనల్ రింగ్ రోడ్డుకు రూ. 500 కోట్లు
-సచివాలయ భవనాల నిర్మాణానికి రూ. 400 కోట్లు
-పరిశ్రమల ప్రోత్సాహానికి రూ. 2,519 కోట్లు
-హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు రూ. 1,500 కోట్లు
-ఎయిర్ పోర్ట్, మెట్రో కనెక్టివిటీకి రూ. 500 కోట్లు
-పాతబస్తీకి, మెట్రో కనెక్టివిటీకి రూ. 500 కోట్లు

-కేసీఆర్ కిట్ పథకానికి రూ. 443 కోట్లు
-ఉపకారవేతనాలకు రూ. 4,688 కోట్లు
-ఆహార సబ్సిడీకి రూ. 2,787 కోట్లు
-మేకలు, గొర్రెల పంపిణీ పథకానికి రూ. 1,000 కోట్లు
-ఎస్టీ నివాస ప్రాంతాల్లో నిర్మాణానికి రూ. 1,000 కోట్లు
-పట్టణ ప్రగతికి రూ. 1,394 కోట్లు
-పట్టణ ప్రాంతాల మిషన్ భగీరథకు రూ. 800 కోట్లు
-కాళేశ్వరం ప్రాజెక్టు పర్యాటక వలయానికి రూ. 750 కోట్లు
-సుంకిశాల ఇన్ టేక్ ప్రాజెక్టుకు రూ. 725 కోట్లు
-పోలీస్ శాఖ భవనాల నిర్మాణానికి రూ. 648 కోట్లు
-వ్యవసాయ రంగానికి రూ. 24,254 కోట్లు

-రైతుబంధు తరహాలో నేత కార్మికులకు ప్రత్యేక పథకం
-భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కొత్త పథకం. తొలి విడతలో లక్ష మంది కార్మికులకు మోటార్ సైకిళ్ల పంపిణీ
-హైదరాబాద్ పరిధిలోని ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలకు రూ. 12.5 కోట్లు
-విద్యుత్ సబ్సిడీలకు రూ. 10,500 కోట్లు
-పరిశ్రమల విద్యుత్ రాయితీలకు రూ. 190 కోట్లు
-పావలా వడ్డీ పథకానికి రూ. 187 కోట్లు
-ఎస్టీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి రూ. 1,000 కోట్లు
-మహిళా యూనివర్శిటీకి రూ. 100 కోట్లు

- Advertisement -