నిరుపేద‌లకు గుడ్ న్యూస్..

84
minister
- Advertisement -

బడ్జెట్‌లో నిరుపేదలకు గుడ్ న్యూస్ అందించింది ప్రభుత్వం. రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన హరీష్..సొంత స్థ‌లంలో డ‌బుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తామన్నారు. సొంత స్థ‌లాల్లో ఇండ్ల నిర్మాణానికి రూ. 3 ల‌క్ష‌ల ఆర్థిక సాయం చేస్తామన్నారు. సొంత‌స్థ‌లం ఉన్న 4 ల‌క్ష‌ల మందికి రూ. 3 ల‌క్ష‌ల ఆర్థిక సాయం…నియోజ‌క‌వ‌ర్గానికి 3 వేల ఇండ్లు కేటాయింపు చేపడతామన్నారు. ఎమ్మెల్యేల ప‌రిధిలో 3.57 ల‌క్ష‌ల ఇండ్లు కేటాయింపు,నిర్వాసితులు, ప్ర‌మాద బాధితుల‌కు 43 వేల ఇండ్లు కేటాయింపు జరుగుతుందన్నారు. సీఎం ప‌రిధిలో నిర్వాసితులు, ప్ర‌మాద‌బాధితుల‌కు ఇండ్ల కేటాయింపు చేస్తామన్నారు.

రూ. 2.56 ల‌క్ష‌ల కోట్ల‌తో తెలంగాణ బ‌డ్జెట్‌ను ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు ప్ర‌వేశ‌పెట్టారు. రెవెన్యూ వ్య‌యం రూ. 1.89 ల‌క్ష‌ల కోట్లు కాగా, క్యాపిట‌ల్ వ్య‌యం రూ. 29,728 కోట్లు.కేంద్రం తీరుతో తెలంగాణకు 5వేలకోట్ల నష్టం జరిగిందన్నారు. ఆర్థిక సంఘం సూచనలు కేంద్రం పట్టించుకోలేదు. కరోనా సమయంలోనూ కేంద్రం అదనంగా రూపాయి ఇవ్వలేదు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచుతూ నిబంధనలు విధించింది. కేంద్రం తీరుతో రాష్ట్రం ఏటా 5వేల కోట్లు నష్టపోతోంది. ఈ లెక్కన ఐదేళ్లలో రూ.25వేల కోట్లు నష్టపోతున్నాం అన్నారు.

ప‌ల్లె ప్ర‌గ‌తికి రూ. 330 కోట్లు,ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తికి రూ. 1394 కోట్లు,కొత్త వైద్య కాలేజీల‌కు రూ. 1000 కోట్లు,అట‌వీ విశ్వ‌విద్యాల‌యాల‌కు రూ. 100 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిఆరు. ఇదే సభలో గతంలో ఒకప్పుడు పేగులు తెగేదాక కొట్లాడాం. కరెంటు కోతలు, ఆకలి చావులు ఇప్పుడు లేవు. కరెంటు కోతల నుంచి 24 గంటల విద్యుత్‌ కాంతులు సాధించిందన్నారు.

- Advertisement -