గుజరాత్‌లో నాడు మన్మోహన్‌ ఫోటో పెట్టారా: హరీశ్‌రావు

106
harish rao
- Advertisement -

కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ వ్యాఖ్యలపై తెలంగాణ ఆర్థికమంత్రి హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు అసంబద్ధంగా ఉన్నాయని మండిపడ్డారు. కేంద్రం నిధులు ఉపయోగిస్తే మోదీ ఫోటో పెట్టాల్సిందేనని మాట్లాడటంలో ఆర్థం లేదన్నారు. ప్రధానిగా మన్మోహన్‌సింగ్‌ ఉన్న సమయంలో గుజరాత్‌ సీఎంగా ఉన్న మోదీ రేషన్‌ షాపుల్లో మన్మోహన్‌ సింగ్‌ ఫోటో పెట్టారా అని ప్రశ్నించారు. అనాడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నాటి ప్రధాని ఫోటో పెట్టారా అని నిలదీశారు.

ప్రజలు ఎన్నుకన్న ప్రజా ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలపై ఇలాంటి ఒత్తిడి తీసుకురావడం సరిగ్గా లేదన్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌పై హరీశ్‌రావు తొమ్మిది పేజీల సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. కొన్ని పథకాలు లక్ష్యాలు రాష్ట్రాలకు అనుగుణంగా లేవు. రాష్ట్రానికి వచ్చి మూడు విమర్శలు ఆరు అబద్ధాలు ఆడి రాజకీయం చేస్తానంటే తెలంగాణ సమాజం ఉరుకోదు. తెలంగాణలో మీ పాచిక పారదని బీజేపీ గుర్తించాలి.

తెలంగాణ ప్రజలను మీ అవాస్తవాలతో గందరగోళం పెడదామని మీరే గందరగోళంలో పడ్డట్టు అర్థమవుతుంది. తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్ సీఎం కేసీఆర్‌పైన ప్రభుత్వ పథకాలపై పూర్తి స్పష్టతతో ఉన్నారు. ఇలాంటి కుట్ర రాజకీయాలకు స్వస్తి చెప్పాలని పార్టీకి కేంద్ర మంత్రులకు నా సూచన అని లేఖలో పేర్కొన్నారు.

పథకాల పేరుతో రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చేయడం తప్ప సమాఖ్య విలువలను పెంచేట్లు ఉందా అని అడిగారు. ఈ విషయంలో మీరే ఆలోచించాలి. గతంలోనే నీతి ఆయోగ్‌ నియమించిన ముఖ్యమంత్రుల ఉపసంఘం చేసిన సిఫారసులను పట్టించుకున్న పాపాన పోలేదు. ముఖ్యమంత్రుల ఉపసంఘం శాస్త్రీయంగా అధ్యయనం చేసి ఇచ్చిన సిఫారసులు కేంద్రానికి ఎందుకు నచ్చలేదో ప్రజలకు చెప్పాలి డిమాండ్‌ చేశారు. అది వదిలేసి ఫోటోల కోసం రాద్ధాంతం చేయడం చూసి తెలంగాణ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. అని హరీశ్‌ రావు లేఖలో పేర్కొన్నారు.

- Advertisement -