తమిళనాడులో పర్యటించిన రాష్ట్ర ఆర్థిక సంఘం

358
ts logo
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం ఈనెల 3,4 తేదీలలో తమిలనాడు రాష్ట్రములో పర్యటించారు. ఇందులోభాగంగా 3వ తారీకు గురువారంనాడు కాంచీపురం లో ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన క్రింద వేసిన రోడ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమం దిగ్విజయముగా అమలు జరిగినట్లుగా గుర్తించారు. రూర్బన్ పథకం క్రింద ప్రధాన పట్టణాల సమీప గ్రామములలో పట్టణ తరహ సదుపాయాలను సమకుర్చుతున్నటువంటి విషయాన్ని కూడా గమనించారు. ఈ పరిశీలనలో స్తానికంగా అక్కడి ప్రాజెక్ట్ డైరెక్టర్ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్, జిల్లా పరిషత్ సెక్రెటరీ మరియు ఇంజనీర్ మొదలగు వారు పాల్గొన్నారు. అదేవిదంగా తిరువన్నామలై జిల్లాలలో అరుణాచల క్షేత్రం సందర్శన తరువాత పంచాయతిరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు మున్సిపల్ శాఖాధికారులతో సంప్రదింపులు జరిపారు.

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక కమీషన్ ఈ పర్యటనలో గ్రామీణ మరియు పట్టణ స్థానిక సంస్థల అధికారాలు ఆర్థిక వనరుల గురించి తెలుసుకున్నారు. రాష్ట్ర, కేంద్ర ఆర్థిక సంఘాల నిధులు మరియు రూర్బన్, ప్రదానమంత్రి గ్రామీణ సడక యోజన మొదలగు పథకముల గురించి తెలుసు కోవడం జరిగింది. శుక్రవారం చెన్నైలో ని సచివాలయములో ప్రభుత్వ ఉన్నతాధికారులు పంచాయతిరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు మున్సిపల్ శాఖల ముఖ్యకార్యదర్శి, డైరెక్టర్లు, కార్యనిర్వాహక ఇంజనీర్లు ఆర్థిక శాఖాధి కార్లు మొదలగువారు పాల్గొని గ్రామీణ మరియు పట్టణ స్థానిక సంస్థల ఆర్థిక వనరులు, అధికారాలు మరియు విధులు కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంఘాల నిధుల బదలాయింపు మొదలగు అంశాలపై పవర్ పాయింట్ ప్రదర్శన ద్వారా వివరించినారు.

ఈ సందర్భములలో తమిళనాడు రాష్ట్ర అయిదవ ఆర్థిక సంఘ సిఫార్సుల గురించి మరియు ఆ రాష్ట్రపు ఆర్థిక సంఘాల అయిదు నివేదికల అన్ని సిఫార్సులను ఎక్కువ శాతము ఆమోదించి అమలు జరిపినట్లు తెలిసినందున అభినందించనైనది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘ అధ్యక్షులు జి.రాజేశం గౌడ్ గారు తెలంగాణ రాష్ట్ర పతాకస్థాయి అభివృద్ధి పథకాలైన కాళేశ్వరము ఎత్తిపోతలు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ మొదలైన అభివృద్ధి కార్యక్రమములను వివరించి తమిళనాడు అధికారులు ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన రివర్సుపంపింగు ఇంజనీరింగ్ అద్భుతమును దర్శించవలసినదిగా కోరినారు. తర్వాత తమిళనాడు రాష్ట్ర టిటిఆర్వో మురుగునీటి శుద్ధి ప్రాజెక్టును దర్శించనైనది. ఈ పర్యటనలో తెలంగాణ ఆర్థికసంఘ అధ్యక్షులు జి. రాజేశం గౌడ్, సభ్యులు యం. చెన్నయ్య మరియు సభ్య కార్యదర్శి సురేష్ చంద , ఐఏఎస్., గార్లు పాల్గొన్నారు.

- Advertisement -