2వరోజు రైతుబంధు రూ.1152.46 కోట్లు జమ..

146
Rythu Bandhu

2021 రైతుబంధు పంపిణీ వానాకాలం విడతను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈమేరకు తొలిరోజు ఎకరా భూమి గల రైతుల ఖాతాల్లో నగదు జమ చేసింది. రైతుబంధు పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తొలిరోజు 16,95,601 మంది రైతులకు రైతుబంధు అందింది. 10,33,915 ఎకరాలకు రూ. 516.95 కోట్లు పంపిణీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.

ఇక రెండవ రోజు (బుధవారం) రెండెకరాల భూమి గల రైతులకు పంపిణీ చేసింది. ఇందులో భాగంగానే 23.05 లక్షల ఎకరాలకు సంబంధించి 15.07 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1152.46 కోట్లు జమ చేసింది. రైతుబంధు పొందిన రైతులు సంతోషంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపతూ.. రాష్ట్రవ్యాప్తంగా పాలాభిషేకాలు నిర్వహిస్తున్నారు.