యాదాద్రి పునర్నిర్మాణానికి 1200 కోట్లు..!

189
yadadri
- Advertisement -

వచ్చే నవంబర్, డిసెంబర్లోనే యాదాద్రి దేవస్థానం ప్రారంభోత్సవం జరగనుంది. ఈలోపు ఆలయ పునర్నిర్మాణం పనులు పూర్తి చేయాలని ప్రభుత్వ సంకల్పించిందని సీఎంఓ అధికారులు తెలిపారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ రూ 1200 కోట్లు ఖర్చు అవుతాయని సీఎంఓ అధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు ఆలయ పునర్నిర్మాణానికి ₹ 1000 కోట్ల ఖర్చు. అయినట్లు అధికారులు వెల్లడించారు. ఆలయ నిర్మాణం పూర్తయ్యేవరకు ఇంకో 200 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నామన్నారు.

ఒక్కసారి ఆలయం ప్రారంభమైతే యాదగిరిగుట్టకు జనం క్యూ కడతారు. వారాంతాల్లో ఇప్పటికే సందర్శకుల సంఖ్య 60 వేలకు పైగా ఉంటుంది. ఇక పునర్నిర్మించిన దేవాలయం ప్రారంభమైతే వారాంతాల్లో భక్తుల రద్దీ ఒక లక్షకు చేరుతుంది. ఏడాదిలో యాదాద్రిలో తిరుమలకు మించి భక్తులు పోటెత్తుతారు. అందుకే ప్రభుత్వం యాదాద్రి భక్తుల ప్రసాద అవసరాల కోసం ఆటోమాటిక్ లడ్డూ మిషన్‌ను కొనుగోలు చేసింది. ఈ ఆటోమాటిక్ మిషన్ రోజుకు 3 లక్షల లడ్డూలు తయారుచేస్తుందని అధికారులు తెలిపారు.

యాదాద్రి దేవాలయ నిర్మాణంలో భాగంగానే అందమైన విద్యుత్ దీపాలు అమార్చామని.. వైఖానస, ఆగమశాస్త్రాలు, వైష్ణవ సంప్రదాయాల ప్రకారం పవిత్రమైన రోజుల్లో, వివిధ సందర్భాలు, పండగలు, ఇతర సమయాల్లో రాత్రి వేళల్లో రంగురంగుల విద్యుత్ దీపాల కాంతులతో ధగధగ మెరవనున్న యాదాద్రి దేవాలయం చూడవచ్చని పేర్కొన్నారు.

- Advertisement -