ఒమిక్రాన్ వ్యాప్తి.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

87
- Advertisement -

కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలకు సెలవులను పొడిగించింది. వాస్తవానికి ఈ నెల 8 నుంచి ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది. ఈరోజుతో సెలవులు ముగిశాయి. అయితే కరోనా కొత్త వేరియెంట్‌ ఒమిక్రాన్ వ్యాప్తి, కరోనా కేసుల పెరుగుదలతో స్కూళ్లకు మరికొన్నాళ్లపాటు సెలవులివ్వాలన్న వైద్యారోగ్య శాఖ సిఫార్సు చేసింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మరి కొన్ని రోజులు సెలవులను ప్రకటించింది. ఈ నెల 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఇవాళ ఉత్తర్వులను జారీ చేశారు.

- Advertisement -