రోడ్డెక్కిన ఎలక్ట్రిక్ బస్సులు…

268
electric-buses
- Advertisement -

భాగ్యనగరవాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు టీఎస్ ఆర్టీసీ తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ బస్సులు రయ్‌ రయ్‌ మంటూ రోడ్డెక్కాయి.మియాపుర్ డిపో,జేబీఎస్ నుంచి ఈ బస్సులను నడపనున్నారు. మామూలు బస్సుల కంటే ప్రత్యేక ఆకర్షణీయంగా వీటిని ఏర్పాటు చేశారు.

12 మీటర్ల పొడవుతో ఉండే ఈ ఎలక్ట్రిక్ బస్సులో డ్రైవర్ తో పాటు మరో 39 మంది ప్రయాణించవచ్చు. లిథియం ఇయాన్ బ్యాటరీతో నడిచే ఈ ఎలక్ట్రిక్ బస్సులు.. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే దాదాపు 250 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తాయి. వయో వృద్ధులు ఎక్కి దిగడానికి వీలుగా ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. ఎయిర్, సౌండ్ పొల్యూషన్ లేకపోవడం ఈ బస్సుల స్పెషాలిటీ.బస్సులకు ఛార్జింగ్‌ చేసేందుకు ఒక్కో స్టేషన్‌లో 12 పాయింట్లు ఏర్పాటు చేశారు. ఒక్కో విద్యుత్‌ బస్సు కోసం ప్రభుత్వం రూ.2.5 కోట్లు ఖర్చు చేస్తోంది.

ఎలక్ట్రిక్ బస్సులు తిరిగే రూట్లు..

() జేబీఎస్ నుంచి సంగీత్, ఉప్పల్, ఎల్‌బీ నగర్, చాంద్రాయణగుట్ట మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకు
() జేబీఎస్ నుంచి సంగీత్, ప్యారడైజ్, సెక్రటేరియట్, మాసబ్ ట్యాంక్, పీవీ ఎక్స్‌ప్రెస్ వే మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకు
() మియాపూర్ నుంచి కేపీహెచ్‌బీ, జేఎన్టీయూ, ఫోరం మాల్, సైబర్ టవర్, గచ్చిబౌలి నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు
()బీహెచ్‌ఈఎల్ నుంచి ఆల్విన్ క్రాస్‌రోడ్, కొండాపూర్, శిల్పారామం, సైబర్‌సిటీ, గచ్చిబౌలి మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకు

- Advertisement -