గెట్ రెడీ.. దంగల్ షురూ!

38
- Advertisement -

తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి నేటితో తెర పడనుంది. చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీలన్నీ విస్తృతంగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఇక 30న పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 3 న ఫలితాలు వెలువడనున్నాయి. ఈసారి ఎన్నికల్లో విజయం కోసం అన్నీ పార్టీలు గట్టిగా పోటీ పడుతున్నాయి. గత తొమ్మిదిన్నర ఏళ్లుగా కే‌సి‌ఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ది సంక్షేమం సమపాళ్ళలో సాగుతూ వేగంగా డెవలప్ చెందిన రాష్ట్రంగా అవతరించింది. దాంతో మరోసారి కే‌సి‌ఆర్ కు అధికారం కట్టబెట్టేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు. అటు కాంగ్రెస్, మరియు బీజేపీ పార్టీలు ప్రస్తుతం హడావిడి చేస్తున్నప్పటికీ అదంతా ఒట్టిదే అని తేలిపోయింది. .

క్షేత్ర స్థాయిలో ఈ రెండు పార్టీల పట్ల ప్రజలు సుముఖంగా లేరని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక ఎన్నికల్లో ప్రజల మూడ్ ను రిప్రెజెంట్ చేసేలా ఆయా సర్వేలు బయటకు వస్తున్నప్పటికి ఏవి వాస్తవమైనవి.. ఏవి అవాస్తవమైనవి అనేది అంతుచిక్కడం లేదు. అయితే సర్వేలు ఎలగున్నా ప్రజలు మాత్రం బి‌ఆర్‌ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారని క్షేత్ర స్థాయి నుంచి విశ్లేషణలు బయటకు వస్తున్నాయి. ఈసారి బి‌ఆర్‌ఎస్ గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధించే అవకాశం ఉందని నివేధికలు తేల్చి చెబుతున్నారు.

ప్రస్తుతం కాంగ్రెస్ బీజేపీ పార్టీలు తాటాకు చప్పుళ్ళు ఎన్ని చేసిన బి‌ఆర్‌ఎస్ విజయాన్ని ఆపడం కష్టమే అని ప్రజలే తేల్చి చెబుతున్నారు. ఇక నేడు ప్రచారానికి చివరి రోజు కావడంతో సాయంత్రం 5 గంటలకు మైకులన్ని మూగబోనున్నాయి. ఈ రెండు రోజులు పోల్ మేనేజ్మెంట్ పై నేతలు దృష్టి సారించే అవకాశం ఉంది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం, మనీ తో పార్టీల నేతలు రెడీ అయ్యే అవకాశం ఉంది. ఓటుకు నోటు ఇవ్వడంలోనూ, ప్రలోభాలకు గురి చేయడంలోనూ కాంగ్రెస్, బీజేపీ నేతలు సిద్దహస్తులు, గతంలో రేవంత్ రెడ్డి చేసిన ఓటు రాజకీయం ( ఓటుకు నోటు కేసు ) అందరికీ విధితమే. ఇక మనీతో ఓట్లను కొనడం బీజేపీ అంతర్గత వ్యూహం.. ఇలా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎన్ని ప్రయత్నాలు చేసిన తెలంగాణ ప్రజలు తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారనేది వాస్తవం.

Also Read:యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్.. ఉపేంద్ర గాడి అడ్డా

- Advertisement -