తెలంగాణలో స్ధానికంగా కరోనా వ్యాపించలేదని…ఇప్పటివరకు 272 కేసులు నమోదుకాగా యాక్టివ్ పాజిటివ్ కేసులు 228. శనివారం ఒక్కరోజే 43 పాజిటివ్ కేసులు నమోదుకాగా ఇప్పటివరకు 33 మంది కొలుకున్నారు.
జిల్లాల వారీగా వివరాలను పరిశీలిస్తే ఆదిలాబాద్ 9,భద్రాద్రిలో 3 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఒకరు డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాద్‌లో 93 కేసులు నమోదుకాగా 11 మంది డిశ్చార్జ్ అయ్యారు. జగిత్యాల్ 2, జనగామ 2,జయశంకర్ భూపాలపల్లి 1,జోగులాంబ గద్వాల్ 5,కామారెడ్డి 10 కేసులు నమోదయ్యాయి.
ఇక కరీంనగర్‌లో 6 పాజిటివ్ కేసులు ఉండగా 11 మంది డిశ్చార్జ్ అయ్యారు. మహబూబాబాద్ 1,మహబూబ్ నగర్‌లో 3 కేసులు నమోదుకాగా ఒక్కరు డిశ్చార్జ్ అయ్యారు. మెదక్ 5, మేడ్చల్ 12,నాగర్ కర్నూల్ 2, నల్గొండ 13,నిజామాబాద్ 18,రంగారెడ్డి 10, సంగారెడ్డి 6, సిద్దిపేట 1,సూర్యపేట 1,వరంగల్ రూరల్ 2,వరంగల్ అర్బన్ 21,వికారాబాద్ 2 కేసులు నమోదయ్యాయి.