పెళ్లి వార్తలను ఖండించిన కీర్తి సురేష్‌..

223
keerhi suresh, ntr biopic

తన పెళ్లిపై వస్తున్న వార్తల్లో నిజంలేదని అవన్నీ పుకార్లేనని తెలిపారు కీర్తి సురేష్‌. మరో ఏడాది వరకు కాల్ షీట్ ఇచ్చానని..ఈ పరిస్ధితుల్లో పెళ్లి ఎలా జరుగుతుందని ..ఇలాంటి వదంతులు వ్యాప్తి చేయవద్దని సూచించారు.

ప్రముఖ బీజేపీ నాయకుడి కుమారుడిని కీర్తి సురేష్‌ పెళ్లాడబోతుందని..ఈ ఏడాది చివరలో వీరి వివాహం జరగనున్నట్లు కొన్ని పత్రికలు కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. దీంతో కీర్తిని పెళ్లాడబోయే ఆ వ్యాపారవేత్త ఎవరు? వివాహం ఎప్పుడు ఉంటుందనే దానిపై అందరికి ఆసక్తి నెలకొనగా ఆ వార్తలను ఖండించారు కీర్తి.

నేను శైలజ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ కీర్తి సురేష్‌. తొలి సినిమాతోనే తెలుగువారి మనసు దోచుకున్న కీర్తి …తర్వాత నాని హీరోగా వచ్చిన ‘నేను లోకల్‌’ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక మహానటి మూవీతో విమర్శకుల ప్రశంసలు పొందిన కీర్తి ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీ ఆర్టిస్టుగా మారిపోయింది.