సీఎం కేసీఆర్ నమ్మకాన్ని నిలబెడతా:దూదిమెట్ల బాలరాజు

22
balaraju yadav

సీఎం కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని తెలిపారు తెలంగాణ రాష్ట్ర షీప్స్ అండ్ గోట్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు. హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్‌లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు బాలరాజు యాదవ్.

ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, MLA లు చిరుమర్తి లింగయ్య, దానం నాగేందర్, బేతి సుభాష్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, రాంచందర్ తదితరులు హాజరయ్యారు.