విలక్షణ నటుడు శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ తెలంగాణ దేవుడు. హరీశ్ వధ్య దర్శకత్వంలో మహ్మాద్ జాకీర్ ఉస్మాన్ నిర్మాణంలో సినిమాను తెరకెక్కించారు. ఇందులో కేసీఆర్ పేరు ఎక్కడా ప్రస్తావించక పోయినా ఆయన బయోపిక్ అనే మాట గట్టిగా వినిపిస్తొంది. తాజాగా ఈసినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. ట్రైలర్ లో బతుకమ్మ పాటతో ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో విజయ్ దేవ్ అనే పాత్రలో శ్రీకాంత్ కనిపిస్తున్నాడు.
ఆయన బాడీ లాంగ్వేజ్ .. డైలాగ్ డెలివరీ కేసీఆర్ ను గుర్తుకు తెస్తున్నాయి. తెలంగాణ ప్రాంతంలోని వెనుకబాటుతనం .. తెలంగాణ విముక్తి కోసం జరిగే పోరాటం .. ప్రధాన పాత్రధారి అయిన శ్రీకాంత్ ఆ దిశగా కంకణం కట్టుకుని ముఖ్యమంత్రి కావడం ఈ ట్రైలర్లో చూపించారు. సుమన్ .. బ్రహ్మానందం .. సాయాజీ షిండే .. తణికెళ్ల భరణి .. పోసాని ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే ఈసినిమాను విడుదల చేయనున్నట్లు సమాచారం.
https://youtu.be/LPQjA06K6Vg