తెలంగాణ‌లో పోటీపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్..

73
pawan kalyan

తెలంగాణ‌లో డిసెంబ‌ర్ 7న జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో జ‌న‌సేన పోటీ చేయ‌డంపై స్పందించారు ఆ పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. తెలంగాణ‌లో నిర్దేశిత కాలంలో ఎన్నిక‌లు జ‌రిగితే ఏయే స్ధానాల్లో పోటీచేయాలన్న దానిపై తాము ఓ ప్ర‌ణాళిక‌ను రూపొందించుకున్నామ‌న్నారు. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు రావ‌డంతో తామ పార్టీ ఎన్నిక‌లలో పోటీ చేయ‌డానికి ఆస‌క్తి చూప‌డం లేద‌న్నారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌లో తెలంగాణ‌లో జ‌న‌సేన పార్టీ త‌ర‌పున పోటీ చేస్తామ‌ని చెప్పారు.

janasena

ముంద‌స్తు ఎన్నిక‌లు రావ‌డంతో కొత్త ఆవిర్భ‌వించిన పార్టీ కావ‌డంతో కొంచెం క‌ష్ట‌త‌ర‌మైంద‌న్నారు. తెలంగాణ ప్ర‌జ‌లకు అండ‌గా నిల‌బ‌డ‌ట‌మే జ‌న‌సేన ల‌క్ష్యం అన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. నేడు తెలంగాణ ఎన్నిక‌ల‌పై పార్టీలోని నాయ‌కుల స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో ప‌లు విష‌యాలు చ‌ర్చించారు. షెడ్యూల్ ప్రకారం జరగనున్న రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేయాలని సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయించింది.