- Advertisement -
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా మరోవైపు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్యను ప్రభుత్వం పెంచగా ఇవాళ ఒక్క రోజే లక్ష కరోనా టెస్టులు నిర్వహించారు.
రాష్ట్రంలో టెస్టుల కెపాసిటీని రెట్టింపు చేశాం…. టెస్టింగ్ వల్ల ప్రొటెక్టేప్ అవుతారు.. కరోనా ను ఎదుర్కొనేందుకు అందరూ సహకారించాలి అని కోరారు వైద్యశాఖ అధికారులు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా లక్షకు పైగా టెస్టులు నిర్వహించిన పాజిటివ్ కేసులు 3000 లోపే వస్తున్నాయి.
గత 24 గంటల్లో రాష్ట్రంలో 2,478 పాజిటివ్ కేసులు నమోదుకాగా ఐదుగురు మృతిచెందారు. ప్రస్తుతం 15,472 యాక్టివ్ కేసులుండగా 1,746 మంది కరోనాతో మృతిచెందారు.
- Advertisement -