తెలంగాణ కరోనా అప్‌డేట్..

35
corona

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 80 వేలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో 509 కరోనా కేసులు నమోదుకాగా ముగ్గురు మృతిచెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,79,644కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 7172 యాక్టివ్ కేసులుండగా 2,70,967 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1505కి చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 63,06,397కి చేరింది.