బొప్పాయితో రోగనిరోధకశక్తి…

26
boppai

బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్క‌లంగా ఉండ‌డం వ‌ల్ల‌ రోగనిరోధకశక్తి పెరిగి.వైరస్‌ల నుంచి ర‌క్షిస్తుంది.అలాగే బొప్పాయిని తరచూ తీసుకోవడం వల్ల‌ జలుబు, ఫ్లూ మరియు ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ ను కలిగించే బాక్టీరియాను అరికట్టేందుకు తోడ్పడుతుంది.

అదేవిధంగా, బొప్పాయిలో సమృద్ధిగా ఉండే పొటాషియం హైబీపీని కంట్రోల్ చేస్తుంది.గుండె ఆరోగ్యానికి కూడా బొప్పాయి ఎంతో మంచిది.ఎందుకంటే బొప్పాయిలో ఫైబర్, పొటాషియం మరియు విటమిన్ కంటెంట్ లు అధికంగా ఉంటాయి.ఇవి గుండె జ‌బ్బుల‌ను నివారిస్తాయి.

అయితే ఆరోగ్యానికి మంచిది క‌దా అని.బొప్పాయిని ఎక్కువ‌గా మాత్రం తీసుకోకూడ‌దు.ఎందుకంటే ఈ పండు జీర్ణం కావ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది.