ఐపీఎల్‌కు దూరమైన భజ్జీ…కారణం ఇదే!

197
harbhajan

ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్‌కి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ఆ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ రైనా ఐపీఎల్ 2020 సీజన్ నుంచి తప్పుకోగా తాజాగా స్పిన్నర్ హర్బజన్ సింగ్‌ కూడా ఐపీఎల్‌కు దూరమయ్యాడు.

తన తల్లికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో సెప్టెంబరు 1 వరకూ చెన్నై ఫ్రాంఛైజీని గడవు అడిగిన హర్భజన్ ….వ్యక్తిగత కారణాలతో తాను ఐపీఎల్ సీజన్‌లో ఆడబోవట్లేదని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.ఇది చాలా క్లిష్ట సమయం. ఫ్యామిలీతో సమయం గడిపేందుకు.. నాకు కొంచెం ప్రైవసీ కావాలి. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ నాకు మద్దతుగా నిలిచింది. ఐపీఎల్ గొప్పగా జరగాలని కోరుకుంటున్నా. సురక్షితంగా ఉండండి.. జై హింద్ అని భజ్జీ వెల్లడించాడు.

ఐపీఎల్‌లో సుదీర్ఘకాలం ముంబయి ఇండియన్స్ టీమ్‌కి ఆడిన హర్భజన్ సింగ్.. 2018 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. మొత్తంగా ఇప్పటి వరకూ 160 మ్యాచ్‌లాడిన ఈ స్పిన్నర్ 7.05 ఎకానమీతో 150 వికెట్లు పడగొట్టాడు.