రాష్ట్రంలో 24 గంటల్లో 617 కరోనా కేసులు…

26
corona

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2 లక్షల 83 వేలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 617 కేసులు నమోదుకాగా ముగ్గురు మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,82,347కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6569 యాక్టివ్ కేసులుండగా 2,74,260 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 1518 మంది కరోనాతో మృతి చెందారు.