తెలంగాణలో 11వేలు దాటిన కరోనా…ఒక్కరోజే 920 కేసులు

183
telangana coronavirus
- Advertisement -

తెలంగాణలో రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా కేసులు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గురువారం ఒక్కరోజే 920 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒక్కరోజు నమోదైన కేసులు ఇదే అత్యధికం కావడం గమనార్హం.

గురువారం 3616 టెస్టులు నిర్వహించగా 920 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11, 364కు చేరగా ఐదుగురు మృతిచెందారు.

వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలోనే 737 ఉండగా రంగారెడ్డి జిల్లాలో 86, మేడ్చల్ జిల్లాలో 60, కరీంనగర్ జిల్లాలో 13 చొప్పున కేసులు నమోదయ్యాయి. రాజన్నసిరిసిల్లలో 4, మహబూబ్ నగర్ లో 3, నల్గొండలో 3, మెదక్, వరంగల్ అర్బన్, ములుగులో 2 కేసుల చొప్పున గుర్తించారు. వరంగల్ రూరల్, కామారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, జనగామ, మహబూబాబాద్, ఆదిలాబాద్, కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లాలో ఒక్కో కేసు నమోదైంది.

- Advertisement -