రాష్ట్రంలో 24 గంటల్లో 147 కరోనా కేసులు..

128
New variant of coronavirus
- Advertisement -

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 147 పాజిటివ్ కేసులు నమోదుకాగా ఒకరు మృతి చెందారు.దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో పాజిటివ్ కేసులు సంఖ్య 2,93,737 కు చేరాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో 2819 యాక్టివ్ కేసులుండగా 1,593 మంది కరోనాతో మృతి చెందారు. కరోనా నుండి ఇప్పటివరకు 2,89,325 మంది కోలుకున్నారు. దేశంలో కరోనా మరణాల రేట 1.4 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.54 శాతంగా ఉంది. రికవరీ రేటు దేశంలో 96.9 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 98.49 శాతానికి పెరిగింది. ఇప్పటివరకు 77,28,296 టెస్టులు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

- Advertisement -