24 గంటల్లో 1718 కరోనా కేసులు…

98
corona

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 1,718 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా కరోనా వైరస్‌తో 8 మంది మృతిచెందారు.

ఇప్పటివరకు రాష్ట్రంలో 1,97,327 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా కరోనాతో 1153 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 28,328 పాజిటివ్ కేసులు నమోదుకాగా మొత్తం 1,67,846 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.58 శాతంగా ఉండగా రికవరీ రేటు 85.05గా ఉంది. గత 24 గంటల్లో 49,084 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటివరకు 31,53,626 టెస్టులు చేసినట్లు వెల్లడించింది వైద్య ఆరోగ్య శాఖ.