రాష్ట్రంలో లక్షా 4వేలు దాటిన కరోనా కేసులు…

117
coronavirus

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటాయి. రోజుకు వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 2384 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 11 మంది మృతిచెందారు.

దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,04,249కి చేరింది. ఇందులో 80,586 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 22,908 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

గత 24 గంటల్లో 1851 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ కాగా ఇప్పటివరకు 755 మంది కరోనాతో మృతిచెందారు. హైదరాబాద్ లో 472, నిజామాబాద్ లో 148, నల్గొండలో 137 కేసులు నమోదయ్యాయి.