తెలంగాణ కరోనా అప్‌డేట్..

127
corona
- Advertisement -

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 761 పాజిటివ్ కేసులు నమోదు కాగా నలుగురు మృతిచెందారు.దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,67,665కు చేరుకున్నాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో 10,839 యాక్టివ్ కేసులుండగా రికవరీ కేసులు 2,55,378కు చేరాయి. కరోనాతో ఇప్పటివరకు 1448 మంది మృతిచెందారు. దేశంలో కరోనా మరణాల శాతం 1.5 శాతంగా ఉంటే రాష్ట్రంలో 0.54కు పడిపోయింది.

దేశవ్యాప్తంగా రికవరీ రేటు 93.6 శాతంగా ఉంటే రాష్ట్రంలో రికవరీ రేటు 95.40 శాతంగా ఉందని బులెటిన్‌లో పేర్కొంది. గత 24 గంటల్లో 42,242 శాంపిల్స్ టెస్టు చేయగా 53,32,150 టెస్టులు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

- Advertisement -