24 గంటల్లో 3018 కరోనా కేసులు…

52
coronavirus

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోయింది. ఇప్పటివరకు లక్షా 11 వేలకు పైగా కేసులు నమోదుకాగా గత 24 గంటల్లో 3018 కొత్త కేసులు నమోదుకాగా 10 మంది మృతిచెందారు.

దీంతో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 1,11,688కి చేరగా 780 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు కరోనాతో 85,223 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 25,685 యాక్టివ్‌ కేసులున్నాయి.

జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలను పరిశీలిస్తే జీహెచ్ఎంసి పరిధిలో 475, జగిత్యాలలో 100, కామారెడ్డిలో 76, కరీంనగర్ లో 127, ఖమ్మంలో 161, మహబూబాబాద్ లో 60, మంచిర్యాలలో 103, మేడ్చల్ లో 204, నల్గొండలో 190, నిజామాబాద్ జిల్లాలో 136, పెద్దపల్లిలో 85, రాజన్న సిరిసిల్లలో 69, రంగారెడ్డిలో 247 కేసులు నమోదయ్యాయి.