రాష్ట్రంలో 90 వేలు దాటిన కరోనా కేసులు..

178
coronavirus
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 90 వేలు దాటాయి. గత 24 గంటల్లో 1863 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 10 మంది మృత్యువాతపడ్డారు.క‌రోనా కేసుల సంఖ్య 90,259కి చేర‌గా ఇప్పటివరకు 684 మంది మృత్యువాతపడ్డారు. 66,196 మంది కరోనా నుండి కోలుకోగా 23,376 యాక్టివ్ కేసులు్నాయి. నిన్న ఒక్కరోజే 21,239 కరోనా టెస్టులు నిర్వహించామని….రాష్ట్రంలో మ‌ర‌ణాల రేటు 0.75 శాతం ఉందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలను పరిశీలిస్తే జీహెచ్ఎంసీలో 394, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరిలో 175, రంగారెడ్డి జిల్లాలో 131, క‌రీంన‌గ‌ర్లో 104, వ‌రంగ‌ల్ అర్బ‌న్‌లో 101, రాజ‌న్న సిరిసిల్ల 90, సంగారెడ్డి 81, ఖ‌మ్మం 61, , జ‌గిత్యాల 61, సిద్దిపేట 60, గ‌ద్వాల జిల్లాలో 58, న‌ల్ల‌గొండ 49, వ‌రంగ‌ల్ రూర‌ల్ 41, పెద్ద‌ప‌ల్లి 40, నిజామాబాద్ 39, కొత్త‌గూడెం 36, మెద‌క్ 36, జ‌న‌గామా 34 కేసులు న‌మోద‌య్యాయి.

- Advertisement -