రాష్ట్రంలో 24 గంటల్లో 1896 కరోనా కేసులు నమోదు..

171
corona
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 83 వేలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 1896 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 8 మంది మృతిచెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇక తెలంగాణలో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 82,647కి చేరగా కరోనాతో ఇప్పటివరకు 645 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22,628 యాక్టివ్ కేసులుండగా 59,374 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు.

ఇప్పటి వరకు 6,42,875 నమూనాలు పరీక్షించామని ..తెలంగాణలో రికవరీ రేటు 71.84 శాతంగా ఉందని తెలిపింది వైద్య ఆరోగ్య శాఖ.

- Advertisement -