24 గంటల్లో 2392 కరోనా కేసులు..

1501
coronavirus

తెలంగాణలో కరోనా కేసులు లక్షా 45 వేలు దాటాయి. గత 24 గంటల్లో 2,392 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 11 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,45,163కి చేరాయి.

ఇప్పటివరకు కరోనాతో 906 మంది మృతిచెందగా 1,12,587 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 31,670 యాక్టివ్‌ కేసులు ఉండగా రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.62శాతం ఉంది.

జిల్లాల వారీగా గత 24 గంటల్లో నమోదైన కేసుల వివరాలను పరిశీలిస్తే గ్రేటర్‌ హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో 304 ,రంగారెడ్డి జిల్లాలో 191, కరీంనగర్‌లో 157, మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 132, ఖమ్మంలో 116, నల్గొండలో 105, నిజామాబాద్‌లో 102, సూర్యపేటలో 101, భద్రాద్రి కొత్తగూడెంలో 95, వరంగల్‌ అర్బన్‌లో 91 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 18,27,905 కరోనా టెస్టులు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.