రాష్ట్రంలో 24 గంటల్లో 1949 కరోనా కేసులు..

95
corona

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో రాష్టంలో కొత్తగా 1,949 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 10 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,99,276కి చేరాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో 27,901 యాక్టివ్ కేసులుండగా 1,70,212 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. హోం ఐసోలేషన్‌లో 22,816 మంది ఉన్నారు. 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 291 కరోనా కేసులు నమోదు కాగా ఇప్పటివరకు 33 లక్షలకు పైగా కరోనా టెస్టులు నిర్వహించారు. కరోనాతో 1163 మంది మృతిచెందారు.