ఓటు హక్కు వినియోంచుకున్న సోలిపేట సుజాత..

123
dubbaka by elections

దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఓటు వేసేందుకు ప్రజలు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. తన స్వగ్రామం చిట్టాపూర్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత.

ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.. కోవిడ్‌ కారణంగా పోలింగ్‌ సమయాన్ని గంటపాటు పెంచారు అధికారులు. మాస్క్‌ ఉంటేనే ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు. బొప్పాపూర్ పోలింగ్ కేంద్రంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు బీజేపీ అభ్యర్థి రఘు నందన్ రావు.