రాష్ట్రంలో 24 గంటల్లో 1486 కరోనా కేసులు…

167
telangana corona
- Advertisement -

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో 1,486 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా 7గురు మృతిచెందారు. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,24,545కు చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 20,686 యాక్టివ్ కేసులుండగా 2,02,577 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. కరోనాతో ఇప్పటివరకు 1,282 మంది మృతిచెందారు.

రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 90.21 శాతంగా ఉండగా రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 0.57 శాతానికి చేరింది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 42,299 కరోనా శాంపిల్స్ పరీక్షించారు.

- Advertisement -