బిగ్ బాస్ 3లో తెలంగాణ హవా

462
Srimukhi Rahul
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ 3కి నిన్నటితో తెరపడింది. గత మూడు నెలలుగా బుల్లితెరపై ప్రేక్షకులను అలరించారు బిగ్ బాస్ కంటెస్టెంట్లు. జూన్ 21న ప్రారంభమైన బిగ్ బాస్ 3 నవంబర్ 3న ముగిసింది. కాగా బిగ్ బాస్ 3 టైటిల్ ను రాహుల్ సొంతం చేసుకోగా..ప్రముఖ యాంకర్ శ్రీముఖి రన్నరప్ గా నిలిచారు. విన్నర్ గా నిలిచిన రాహుల్ కు మెగాస్టార్ చిరంజీవి బిగ్ బాస్ ట్రోఫీతో పాటు రూ.50లక్షల చెక్కును అందజేశారు.

కాగా బిగ్ బాస్ 3లో తెలంగాణ ప్రాంతానికి చెందిన సెలబ్రెటీలు ఇద్దరు టాప్ 2లో నిలవడం ఇదే తొలిసారి కావడం విశేషం. హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీకి చెందిన రాహుల్ టాప్ ప్లేస్ లో నిలవగా, నిజామాబాద్ కు చెందిన యాంకర్ శ్రీముఖి టాప్ 2లో నిలిచారు. ఇక టాప్ 6లో నిజామాబాద్ కు చెందిన శివజ్యోతి ఉంది. టాప్ 6లో ముగ్గురు తెలంగాణ సెలబ్రెటీలు ఉండటం ఇదే తొలిసారి కావడం గర్వకారణంగా చెప్పుకోవచ్చు.

ఇక బిగ్ బాస్ 1,2 సీజన్లు చూసుకుంటే ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తులే టాప్ ప్లేస్ లో నిలిచారు. బిగ్ బాస్ సీజన్ 1లో విన్నర్ గా నిలిచిన శివ బాలాజి, రన్నర్ ఆదర్శ్ ఇద్దరు ఆంధ్ర ప్రాంతం వ్యక్తులే. అలాగే సీజన్ 2లో విన్నర్ కౌశల్ మంద, రన్నర్ గీతా మాధురి కూడా ఇద్దరు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారే. ఒక తొలిసారిగా బిగ్ బాస్ 3లో టాప్ 2 కంటెస్టెంట్స్ తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే కావడంతో ఇక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -