బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

360
biodiversityflyover
- Advertisement -

గచ్చిబౌలి బయోడైవర్సిటీ జంక్షన్‌ ఫ్లై ఓవర్ ను ప్రారంభించారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. మెహిదీపట్నం నుంచి ఖాజాగూడ ఖాజాగూడ రహదారిలో ఈప్లై ఓవర్ ను నిర్మించారు. ఈకార్యక్రమంలోవిద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

ఈ ఫ్లై ఓవర్ ప్రారంభం వల్ల ఖాజాగూడ నుంచి మైండ్‌స్సేస్ వైపు వెళ్లే ట్రాఫిక్‌కు ఎంతో వెసులుబాటు కలుగుతుంది. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక(ఎస్‌ఆర్‌డీపీ)లో భాగంగా బయోడైవర్సిటీ జంక్షన్‌లో రెండు ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టారు. రూ.69.47కోట్ల వ్యయంతో ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి చేశారు.

ఈ మూడు లేన్ల ఫ్లైఓవర్‌తో ఆ మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు చాలావరకు పరిష్కారమవుతాయి. ఈ మార్గంలో ప్రస్తుతం గంటకు 14వేలకుపైగా వాహనాలు నడుస్తుండగా, 2035నాటికి వీటి సంఖ్య రెట్టింపవుతుందని అంచనావేసి దీని నిర్మాణం చేపట్టారు. ఈ ఫ్లై ఓవర్ ప్రారంభంతో గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ తగ్గనుంది. కాలుష్యస్థాయి కూడా చాలా వరకు తగ్గనుంది.

- Advertisement -