టీకాంగ్రెస్ పార్టీ రెండుగా చీలనుందా..?

112
revanth
- Advertisement -

హుజురాబాద్ ఉప ఎన్నికలు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టేసాయి. అసలు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ గెలిచే సీన్ లేదని, అదే ఈటల గెలిస్తే…టీఆర్ఎస్‌ను దెబ్బకొట్టినట్లు అవుతుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నాడు. కాని కాంగ్రెస్ సీనియర్ నేతలు మాత్రం రేవంత్ రెడ్డి ఆలోచనను తప్పు పడుతున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల గెలిస్తే బీజేపీ మళ్లీ ఫామ్‌లోకి వస్తుందని, ఇప్పటి వరకు చేపట్టిన దండోరా సభలు, జంగ్‌ సైరన్‌లకు అర్థం లేకుండా పోతుందని, పార్టీకి వచ్చిన ఊపు కూడా పోతుందని కాంగ్రెస్ నేతలు రేవంత్‌పై మండిపడుతున్నారంట…ఈటల గెలిస్తే బీజేపీలో పవర్ సెంటర్‌గా ఎదుగుతారని, అదే ఓడిపోతే కాంగ్రెస్‌లోకి వస్తాడని ఈ చిన్న లాజిక్ కూడా ఎలా మర్చిపోయాడని రేవంత్‌‌పై కాంగ్రెస్ సీనియర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారంట…అందరూ కలిసి టీఆర్ఎస్, బీజేపీలను టార్గెట్ చేస్తూ ప్రచారం చేస్తే ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నా…. రేవంత్ రెడ్డి కావాలనే ఈటల కోసం సొంత పార్టీని దెబ్బకొట్టాడని సీనియర్లు ఫైర్ అవుతున్నరంట.

ఇప్పటికే రేవంత్‌కు, కాంగ్రెస్ సీనియర్లకు మధ్య పచ్చ గడ్డి వేయకుండానే భగ్గుమంటోంది. కోమటిరెడ్డి, జగ్గారెడ్డి, వీహెచ్, ఉత్తమ్ వంటి నేతలు రేవంత్ జుట్టు ఎక్కడ దొరుకుతుందా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారంట……హుజురాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్‌కు గౌరవప్రదమైన ఓట్లు సాధించి టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులకు గట్టిపోటీ ఇస్తే రేవంత్‌కు మైలేజీ దక్కుతుంది…అలా కాకుండా కనీసం డిపాజిట్ కూడా దక్కకుండా చిత్తుగా ఓడిపోతే కాంగ్రెస్ పరువు గంగలో కలుస్తోంది. అదే జరిగితే బీజేపీ మళ్లీ దూకుడు పెంచి పార్టీని వెనక్కి నెట్టే అవకాశం ఉందని కాంగ్రెస్ సీనియర్లు భావిస్తున్నారంట.

అందుకే ఈటల కోసం పార్టీ నేతలను బలిపశువులను చేస్తున్న రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్లంతా కలిసి తిరుగుబాటు చేసే అవకాశం ఉందని , నవంబర్‌లో కాంగ్రెస్ పార్టీలో అతిపెద్ద సంక్షోభం చోటుచేసుకోబోతుందని గాంధీభవన్‌లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే టీడీపీ నేతలతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీని తెలుగు కాంగ్రెస్‌గా మారుస్తున్నాడని రేవంత్‌పై సీనియర్లు గుర్రుగా ఉన్నారు. హుజురాబాద్‌లో ఓడిపోయినా కనీసం గౌరవప్రదమైన ఓట్లు కూడా సాధించకపోతే రేవంత్‌తో తాడోపేడో తేల్చుకునేందుకు కాంగ్రెస్ సీనియర్లు రెడీ అవుతున్నారని సమాచారం. వచ్చే నెలలో హుజురాబాద్ ఫలితాలు వచ్చిన మరుక్షణం కాంగ్రెస్ సీనియర్లు అధిష్టానంపై తిరుగుబాటు చేస్తారని, కాంగ్రెస్ పార్టీ రేవంత్ సారథ్యంలోని తెలుగు కాంగ్రెస్‌గా, కోమటిరెడ్డి వంటి కాంగ్రెస్ సీనియర్ నేతల సారథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌గా రెండుగా చీలడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల గెలుపు కోసం రేవంత్ చేస్తున్న కుట్రలు చివరకు కాంగ్రెస్ పార్టీకే ఎసరు పెట్టబోతున్నాయని గాంధీభవన్‌లో చర్చ జరుగుతోంది.

- Advertisement -