ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార కాంగ్రెస్ పార్టీ కుయుక్తులకు తెర తీస్తోందా ? ప్రత్యర్థి పార్టీల నేతలను ప్రలోభాలకు గురి చేస్తోందా ? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇటీవల బిఆర్‌ఎస్ పార్టీ నుంచి కొంతమంది నేతలను కాంగ్రెస్ పార్టీలో కలుపుకునే ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కడియం శ్రీహరి, కేకే వంటి వారు బిఆర్‌ఎస్ విడిచి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమయ్యారు. హటాత్తుగా వీరు పార్టీ మారడానికి కాంగ్రెస్ పార్టీ చూపిన ప్రలోభాలే కారణం అనే సంగతి అందరికీ తెలిసిందే. అటు బీజేపీ నుంచి కూడా నేతలను కాంగ్రెస్ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు హస్తం నేతలు. ఈ నేపథ్యంలో బిఆర్‌ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ వైపు వెలుతున్న వారిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమౌతున్నాయి. డబ్బు, పదవి ఆశ చూసి పార్టీలు మార్చే వారు ప్రజా స్వామ్యానికి తూట్లు పొడవడం ఖాయం అనే విమర్శలు ఎదురవుతున్నాయి. .
ముఖ్యంగా బిఆర్‌ఎస్ జెండా తో గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ లో చేరుతున్న కడియం శ్రీహరి లాంటి వారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీ మారాలని చీవాట్లు పెడుతున్నారు. పార్టీ మారుతున్న నేతలను ఉద్దేశించి ఇటీవల బిఆర్‌ఎస్ లో చేరిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. నమ్మిన పార్టీకి వెన్నుపోటు పొడిచే ద్రోహులకు బిఆర్‌ఎస్ లో స్థానం ఉండదని, ఇలాంటి వెన్నుపోట్లు, ద్రోహలు ఉద్యమ పుటల్లో పుట్టిన బిఆర్‌ఎస్ కు కొత్తేమీ కాదని ప్రజల గుండెల్లో బిఆర్‌ఎస్ స్థానం పదిలంగా ఉందని, దాన్ని ఎవరు కదిలించలేరని ఆయన వ్యాఖ్యానించారు. తాను ఎట్టి పరిస్థితుల్లో బిఆర్‌ఎస్ వీడే ప్రసక్తే లేదని, తాను గొర్రెను కానని ఎన్ని ప్రలోభాలు పెట్టిన పార్టీ వీడనని నొక్కి చెప్పారు. మొత్తానికి ఎన్నికల వేళ స్కాంగ్రెస్ వళ్లిస్తున్న కుయుక్తులు, చూపెడుతున్న ప్రలోభలు బిఆర్‌ఎస్ లాంటి ఉద్యమ పార్టీని ఏ మాత్రం దెబ్బ తీయలేవని రాజకీయ వాదులు చెబుతున్నారు.
Also Read:సుహాస్ హీరోగా.. ‘ఓ భామ అయ్యో రామ’