తెలంగాణలో ఎన్నికల వేళ అధికారం కోసం పోటీ రసవత్తరంగా మారుతోంది. రాష్ట్రం ఏర్పడినది మొదలుకొని ఇప్పటికే రెండు సార్లు అధికారం సాధించిన బిఆర్‌ఎస్ మూడోసారి కూడా అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బిఆర్‌ఎస్ తరువాతి స్థానం కోసం గట్టిగా పోటీ పడుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో బిఆర్‌ఎస్ 100 పైగా సీట్లు సాధిస్తుందని అధినేత కేసిఆర్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన సర్వేలు కూడా బిఆర్‌ఎస్ కు 90-100 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని తేల్చి చెప్పడంతో ఈసారి తెలంగాణలో బిఆర్‌ఎస్ హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అటు కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలు అధికారం మాదే అని చెబుతున్నప్పటికీ ఆ రెండు పార్టీలది తాటాకు చప్పుళ్లే అనేది ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. .
కాగా తనకు 80 సీట్లు వస్తాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్నారు. 80 సీట్ల కంటే ఒక్క సీటు తగ్గిన జైలు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. అయితే రాష్ట్రంలో గ్రాండ్ లెవెల్ రిపోర్ట్స్ పరిశీలిస్తే కాంగ్రెస్ కు 20 సీట్లు కూడా తక్కువే అని నివేదికలు చెబుతున్నాయి. సిఎం కేసిఆర్ కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ హడావిడి అంతా 20 సీట్ల కోసమే ఆ పార్టీ నేతల వైఖరి చూస్తే ఇట్టే అర్థమవుతుంది. నిన్న మొన్నటి వరకు బిఆర్‌ఎస్ తరువాతి స్థానం కోసం పోటీ పడిన బీజేపీ ప్రస్తుతం సైలెంట్ కావడంతో ఆ స్థానాన్ని భర్తీ చేసి రాష్ట్రంలో బిఆర్‌ఎస్ తరువాత కాంగ్రెస్ అని అందరి దృష్టిలో పడేలా హస్తం నేతలు హడావిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే పోటీ బిఆర్‌ఎస్ తోనే అని కాంగ్రెస్ చెబుతున్నప్పటికి నిజానికి ఆ పార్టీ పోటీ బీజేపీతోనే అని అందరికీ తెలిసిన విషయం.
Also Read:TTD:పారదర్శకంగా ఇంజినీరింగ్ పోస్టుల నియామకం