కాంగ్రెస్ సిద్దమైనట్లేనా..?

46
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సాధారణ ఎన్నికల కోసం అమాయత్తం అవుతోంది. ఎన్నికలకు కేవలం ఐదు నెలలు మాత్రమే సమయం ఉండడంతో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఎన్నికల ప్రణాళికలను సిద్దం చేసుకుంటుంది. కర్నాటక ఎన్నికల విజయం తరువాత హస్తం పార్టీలో జోష్ పెరిగింది. వరుసగా జాతీయ నేతలు తెలంగాణలో పర్యటిస్తుండడం, కొత్త నేతల చేరికలు కూడా జరుగుతుండడంతో ఇదే టెంపోను ఎన్నికల వరకు కొనసాగించాలని హస్తం పార్టీ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీలోని నేతల్లో జోష్ నింపేందుకు పదవుల విషయంలో కీలక మార్పులు చేసింది హస్తం పార్టీ. తాజాగా జరిగిన ఎఐసిసి కమిటీ సమావేశంలో తెలంగాణ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మెన్ గా మధుయాష్కీ గౌడ్ ను నియిమించింది.

Also Read:‘బేబీ’ ఎన్ని కోట్లు రాబట్టిందంటే?

అలాగే కో చైర్మెన్ గా ఇటీవల కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బాద్యతలు అప్పగించింది. అలాగే రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజిక వర్గాల వారీగా ఏ జిల్లా అధ్యక్షుల విషయంలోనూ కార్యదర్శుల విషయంలోనూ మార్పులు చేసేందుకు హస్తం పార్టీ రెడీ అయినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో పార్టీలోని అన్నీ లొసుగులను సవరించి ఎన్నికల సమయనికి పూర్తిగా పటిష్టంగా తయారు కావాలని హస్తం పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే పదవుల విషయంలోనూ కమిటీల విషయంలోనూ ఎన్నో జాగ్రతలు తీసుకుంటూ బలమైన నేతలకు మాత్రమే ప్రదాన్యత ఇస్తోంది. అయితే నియోజిక వర్గాల వారీగా అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ ఇంకా కసరత్తులు చేస్తూనే ఉంది. మరి వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఉన్న హస్తం పార్టీ బి‌ఆర్‌ఎస్ నుంచి ఎదురయ్యే పోటీని ఎంతవరుకు తట్టుకుని నిలబడుతుంది అనేది చూడాలి.

Also Read:జనసేన గూటికి రఘురామ..?

- Advertisement -