రేవంత్ vs రాహుల్ గాంధీ.. హస్తంలో నయా లొల్లి!

38
- Advertisement -

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్నవేళ పోలిటికల్ హిట్ మరింత పెరుగుతోంది. ముఖ్యంగా టి కాంగ్రెస్ లో సీట్ల గోల రోజురోజుకూ రెట్టింపు అవుతోంది. అసలే పార్టీ బలం అంతంత మాత్రంగానే ఉన్న నేపథ్యంలో సీట్ల కేటాయింపు తలకు మించిన పోటుగా మారింది. ఇప్పటికే ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన హస్తం పార్టీ. ఆ దరఖాస్తులను వడబోసి ఫైనల్ లిస్ట్ ను రెడీ చేయడానికి ఆపసోపాలు పడుతోంది. ఎందుకంటే సీట్లు ఆశిస్తున్న చాలా మంది నేతలు పార్టీలో బలమైన నేతలపై ఆధార పడుతున్నారట. అసలే పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మొదటి నుంచి వేధిస్తున్న వేళ.. సీట్లు ఆశిస్తున్న కొంతమంది నేతలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క వంటి వారికి సన్నిహితంగా మెలుగుతున్నారట. .

రేవంత్ రెడ్డి అనుకూలమైన వారికె సీట్లు కేటాయింపు జరుపుతారని ఇప్పటికే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు నల్గొండ జిల్లాలో తాను డిసైడ్ చేసిన వ్యక్తులకే సీట్లు దక్కుతాయని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెబుతున్నారు. ఇలా ఎవరికి వారు సీట్ల కేటాయింపుపై పంతంగా వ్యవహరిస్తుండడంతో అసలు హస్తం పార్టీలో ఏం జరుగుతుందో కూడా అంచనా వేయలేని పరిస్థితి. ఇక టికెట్ ఆశించే మరికొందరు ఏకంగా రాహుల్ గాంధీతో టచ్ లోకి వెళుతున్నారట. స్క్రినింగ్ కమిటీ డిసైడ్ చేసిన లిస్ట్ లో పేర్లు లేని వారు ఏకంగా రాహుల్ గాంధీతో టచ్ లోకి వెళ్ళి సీట్లు కన్ఫర్మ్ చేసుకునేందుకు మార్గలు వెతుక్కుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

Also Read:బాబు అరెస్ట్ పై అందుకే ఎన్టీఆర్ దూరం

ఉదాహరణకు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజిక వర్గంలో టికెట్ కోసం వడ్డేపల్లి సుభాష్ రెడ్డి మరియు మదన్ మోహన్ రావు మద్య తీవ్ర పోటీ నెలకొంది. దీంతో టికెట్ కోసం వడ్డేపల్లి రేవంత్ రెడ్డిని ఆశ్రయిస్తుంటే.. మదన్ మోహన్ రావు ఏకంగా రాహుల్ గాంధీ ద్వారానే టికెట్ కన్ఫర్మ్ చేసుకునే పనిలో ఉన్నారట. ఇలా చాలా నియోజిక వర్గాలలో ఎవరి ప్రయత్నాలు వారివి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట హస్తం నేతలు. దీంతో సొంత పార్టీలోనే రాహుల్ వర్గం, రేవంత్ వర్గం అని చీలిక ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది. మరి హస్తం పార్టీలో ఈ రకమైన వర్గ పోరు కొత్తేమీ కాదు. అయినప్పటికి ఎన్నికల ముందు ఆ పార్టీకి ఈ పరిణామాలు ఎంతవరకు దారి తీస్తాయో చూడాలి.

Also Read:క్యాబేజీతో ఆరోగ్య ప్రయోజనాలు..!

- Advertisement -